News September 11, 2025

NRPT: వరద నష్టంపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

నిరంతరం కురుస్తున్న వర్షాలకు జిల్లాలో రోడ్లు, భవనాలు, కల్వర్టలు, స్కూల్ భవనలు, వసతి గృహాలు, తాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఏమైనా నష్టం కలిగితే తాత్కాలిక మరమ్మతులకు సంబందించిన ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. వరద నష్టంపై గురువారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్ అధికారులతో సమీక్ష చేశారు. మండలాల వారిగా నివేదికలు తయారు చేయాలన్నారు.

Similar News

News December 10, 2025

GNT: నేటికి ఆ పునాది రాయి పడి 70 ఏళ్లు

image

డిసెంబర్ 10న నాగార్జునసాగర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇక్కడ ఒక జలాశయము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల 1911 లోనే వచ్చింది. ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10న పునాది రాయి పడింది. 3వ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా 1967లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.

News December 10, 2025

పిల్లల పోషణలో ఐసీడిఎస్ కీలకం: కలెక్టర్

image

పిల్లల పోషణ, ఎదుగుదల, ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చడంలో ICDS శాఖ కీలకమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో CDPOలు, సూపర్వైజర్లతో THR పంపిణీ, గ్రోత్ రిపోర్ట్, పోషణ ట్రాకర్ తదితర అంశాలపై సమీక్ష చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం దేశాభివృద్ధికి పునాదన్నారు. కిట్ల పంపిణీతో పాటు హిమోగ్లోబిన్, హైట్, వెయిట్ పెరుగుదలపై పర్యవేక్షణ చేయాలని సూచించారు.