News March 12, 2025

NRPT: వార్డు ఆఫీసర్‌ను అభినందించిన కమిషనర్

image

నారాయణపేట మున్సిపాల్టీలో వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న వేణు నిన్న విడుదలైన గ్రూప్-2 ఫలితాల్లో 31వ ర్యాంకు సాధించి ఉద్యోగం సంపాదించాడు. దీంతో బుధవారం మున్సిపల్ కమిషనర్ బొగేశ్వర్లు వేణును శాలువాతో సన్మానించి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. మునుముందు మరిన్ని ఉన్నత పదవులు సంపాదించాలని కోరారు. మున్సిపల్ సిబ్బంది వేణుకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News February 16, 2026

AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: మోదీ

image

ఢిల్లీలో ఇవాళ్టి నుంచి జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు వస్తున్న వరల్డ్ లీడర్లు, పారిశ్రామిక దిగ్గజాలు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ప్రధాని మోదీ స్వాగతం చెబుతూ ట్వీట్ చేశారు. ‘AIపై చర్చించేందుకు ప్రపంచాన్ని ఏకంగా చేస్తున్నాం. అందరికీ సంక్షేమం, అందరికీ సంతోషమే ధ్యేయంగా సర్వజన హితం, సర్వజన సుఖం థీమ్‌తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. AI వినియోగంలో భారత్ ముందుంది’ అని పేర్కొన్నారు.

News February 16, 2026

HYD: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

image

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 10, HYD స్కార్ట్ డివిజన్‌లో 8, HYD సౌత్ ఈస్ట్ 16, సికింద్రాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం నెలకు రూ.12,000-29,380, వయసు 18-40 ఉండాలి.