News September 10, 2025
NRPT: శాంతియుతంగా ఉత్సవాలు.. ఎస్పీకి సన్మానం

నారాయణపేటతోపాటు జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరగడం పట్ల ఉత్సవ సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బుధవారం కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్‌ను కలిసి శాలువాతో సన్మానించి మెమెంటో అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు విధులు నిర్వహించారని, శోభాయాత్రలో నిర్విరామంగా 36 గంటలకు పైగా పోలీసులు విధుల్లో ఉన్నారని చెప్పారు. అధ్యక్షుడు భీమ్ చందర్ గౌడ్ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News December 11, 2025
మేయర్, ఎంపీపీ స్థానాలు వైసీపీకే: రవీంద్రనాథ్ రెడ్డి

ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కడప నగర మేయర్‌తో పాటు ముద్దనూరు ఎంపీపీ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
News December 11, 2025
గురుకుల స్కూళ్ల ప్రవేశాలకు నోటిఫికేషన్

TG: SC, ST, BC, జనరల్ గురుకుల పాఠశాలల్లో 2026-27లో ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో 5, 6, 9వ తరగతుల్లో చేరికలకు 2026 FEB 22న ఉదయం 11 నుంచి ఒంటిగంట వరకు అన్ని జిల్లాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రకటించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో JAN 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపింది. ప్రాస్పెక్టస్ వివరాలకు ‘https://tgcet.cgg.gov.in’ సందర్శించవచ్చని సూచించింది.
News December 11, 2025
బాపట్ల: DSEOగా శ్రీనివాసరావు బాధ్యతలు

బాపట్ల జిల్లా DSEOగా డి.శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి బాపట్ల జిల్లాకు బదిలీపై వచ్చిన డి.శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కలిసి మొక్కను అందజేశారు. అనంతరం DSEOగా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు.


