News November 12, 2025
NRPT: ‘ప్రజల ఆశ, అత్యాశే మోసగాళ్ల ఆయుధం’

డబ్బుపై ప్రజలకు ఉండే ఆశ, అత్యాశే సైబర్ మోసగాళ్లకు ఆయుధాలని ఎస్పీ డాక్టర్ వినీత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ మోసంలో నష్టపోయి బాధపడటం కంటే అవగాహనతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు. స్మార్ట్‌ఫోన్‌లకు వచ్చే అనవసరపు లింకులు, ఏపీకే ఫైల్స్‌ను తెరవకుండా ఉండటం మంచిదని సూచించారు. ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.
Similar News
News November 12, 2025
5 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

ఢిల్లీ పేలుడు ఘటన తర్వాత దేశంలోని 5 విమానాశ్రయాలకు తాజాగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. HYD, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం ఎయిర్‌పోర్టులు పేల్చేస్తామని దుండగుల నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యాలయానికి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ HYD సహా మిగతా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. బస్టాప్స్, టెంపుల్స్, షాపింగ్ మాల్స్‌లోనూ సోదాలు నిర్వహిస్తోంది.
News November 12, 2025
ఇతిహాసాలు క్విజ్ – 64 సమాధానాలు

ఈరోజు ప్రశ్న: కర్ణుడు బ్రాహ్మణుడు కాదు, క్షత్రియుడు అని పరశురాముడు ఎలా గుర్తించాడు?
జవాబు: ఓరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టి నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో ఓ పురుగు కర్ణుడి తొడను రక్తం వచ్చేలా కుట్టింది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నొప్పిని భరించాడు. రక్తపు ధార తగిలి పరశురాముడు మేల్కొని, ఆ దారుణమైన బాధను సహించే శక్తి క్షత్రియుడికి తప్ప వేరొకరికి ఉండదని గుర్తించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 12, 2025
బిక్కనూర్: కుల బహిష్కరణ.. ఐదుగురిపై కేసు

కుల బహిష్కరణకు పాల్పడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి వారిని రిమాడ్‌కు తరలించినట్లు బిక్కనూర్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. SI తెలిపిన వివారాలు.. జంగంపల్లికి చెందిన దొడ్లే గౌరవ్వ మంత్రాలు చేస్తోందనే నెపంతో కుల సభ్యులు ఆమెకు రూ.2.75 లక్షలు జరిమానా విధించారు. ఆమె నుంచి బలవంతంగా రూ.15 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే కుల బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆమె బుధవారం పోలీసులను ఆశ్రయించింది.


