News December 1, 2025
NRPT: మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ పదవి వీడి సర్పంచ్‌గా నామినేషన్

బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ కూరగాయల రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BRSలో చేరారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా తగిన గౌరవం లభించలేదని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్‌లో చేరిన అనంతరం ధన్వాడ మండల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నీరటి సుజాత రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
Similar News
News December 2, 2025
ఖమ్మం: ఓటు హక్కుపై యువత వినూత్న కార్యక్రమం

ప్రజాస్వామ్య బలోపేతంలో యువత భాగస్వామ్యాన్ని పెంచేందుకు కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన యువకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సోమవారం ‘Cast Your Vote’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంతో వారు తమ సామాజిక బాధ్యతను చాటుకుని, మిగతా యువత అందరికీ ఆదర్శంగా నిలిచారు.
News December 2, 2025
నేడు ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈనెల 2వ తేదీన జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 4న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలించేందుకు మంత్రి వస్తున్నారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
News December 2, 2025
వనపర్తి: ఒకే ఇంట్లో వెనువెంట విషాదం.. ఆగని రోదన

వనపర్తి మండలం పెద్దగూడెంలో ఒకే ఇంట వెనువెంట విషాదం చోటుచేసుకుంది. ఆగని కన్నీరు రోదన గ్రామస్తుల గుండెను కలచివేసింది. గ్రామానికి చెందిన మిన్నయ్య ఈనెల 18న మరణించారు. అతని దశదినకర్మ ఆదివారం ముగిసింది. కొందరు బంధువులు వెళ్లిపోగా ఇంకొందరు సోమవారం ఊళ్లకు పయనమవుతుండగా అకస్మాత్తుగా మిన్నయ్య కొడుకు చాకలి శీను (45) మరణించారు. వెనువెంటవిషాదంతో ఆ ఇంట కంటతడి ఆగలేదని గ్రామస్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


