News February 11, 2025
NRPT: ATMల వద్ద నగదు కాజేస్తున్న నిందితుడి అరెస్టు

ప్రజలను ఏమార్చి ఏటీఎంల వద్ద నగదు కాజేస్తున్న నిందితుడిని సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ శివశంకర్ తెలిపారు. ఏపీలోని తిరుపతి జిల్లా చిన్నగట్టికల్లు మండలం రంగన్నగారి గడ్డకు చెందిన రియాజ్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్ 26న సింగారం గ్రామానికి చెందిన ఖాతాల్ అనే వ్యక్తి ఏటీఎం మార్చి రూ.లక్ష 95 వేలు కాజేశాడని చెప్పారు. నిందితుడుని ఇవాళ అరెస్టు చేసినట్లు వివరించారు.
Similar News
News February 13, 2026
నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.
News February 13, 2026
సంగారెడ్డి: బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత అవగాహన సదస్సు

సంగారెడ్డిలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 18న ఐఈఎల్టీఎస్ (IELTS) పై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్లతో ఈనెల 17వ తేదీలోపు నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News February 13, 2026
కృష్ణా: అప్పుడు ఓడిన నేతకు ఇప్పుడు ఛాన్స్ ఇస్తారా.?

2020లో జరిగిన రాజ్యసభ సభ్యుల ఎన్నికలలో టీడీపీ నుంచి సీనియర్ నేత వర్ల రామయ్య పోటీలో నిలిచారు. అప్పుడు టీడీపీకి శాసనసభ్యుల సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనకు నిరాశే దక్కింది. ప్రస్తుతం ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అవుతుండటంతో కూటమి నుంచి పెద్దల సభకు ఎవరిని పంపుతారోననే చర్చ జోరుగా నడుస్తోంది. ఈ సారి వర్లకు టీడీపీ అధిష్ఠానం ఛాన్స్ ఇస్తోందేమో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.


