News February 18, 2025
NTPCలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 400అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 40శాతం మార్కులతో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్) పాసై 35ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 1లోపు careers.ntpc.co.in/recruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News April 13, 2026
మాణిక్యాంబ దేవి ముఖం.. వామాచార రహస్యం

అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ద్రాక్షారామ మాణిక్యాంబ దేవి విగ్రహం నేరుగా కాకుండా కొద్దిగా ఎడమవైపుకు తిరిగి ఉంటుంది. ఇది అమ్మవారిని పూర్వం ‘వామాచార’ పద్ధతిలో పూజించినట్లు సూచిస్తుందని భక్తులు చెబుతారు. ఇక్కడ అమ్మవారిని శ్రీచక్రంపై ప్రతిష్ఠించారు. అమ్మవారి చూపు ఎడమవైపు ఉండటం వల్ల ఆమె శక్తి అత్యంత తీవ్రంగా ఉంటుందని భక్తులు నమ్ముతారు.
News April 13, 2026
ఆంధ్రా కశ్మీర్ అనంత.. మనదగ్గరా యాపిల్ పంట

AP: ఎక్కువగా చల్లని ప్రదేశాల్లోనే పండే యాపిల్ పంట ఇప్పుడు రాయలసీమకూ విస్తరించింది. అనంతపురం(D) గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో రైతులు సాగు చేస్తున్నారు. 15 ఎకరాల్లో తోటలు వేశారు. డిసెంబర్‌లో పూతకు వచ్చిన చెట్లు ఇప్పుడు కాయలు కాసి కోతకొచ్చాయి. ఎకరానికి టన్ను దిగుబడి వచ్చిందని, కిలో ₹120-170 పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ‘అనంత యాపిల్’ పేరుతో గిఫ్ట్ ప్యాకులుగానూ విక్రయిస్తున్నారు.
News April 13, 2026
తలుపులమ్మ దర్శనం ముగించుకుని వస్తుండగా ప్రమాదం!

ఎస్.రాయవరం మండలం పెనుగొల్లు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకకు చెందిన బి.కృష్ణ, రామలక్ష్మి దంపతులు తలుపులమ్మ లోవ దర్శనం ముగించుకుని వస్తుండగా బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన వారిని ఎం.అప్పలరాజు అనే వ్యక్తి 108 వాహనంలో నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.


