News February 18, 2025
NTPCలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 400అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 40శాతం మార్కులతో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రికల్) పాసై 35ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు.రిజర్వేషన్లు అనుసరించి గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు మార్చి 1లోపు careers.ntpc.co.in/recruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News April 19, 2026
ఓడినా పెరిగిన CSK ర్యాంక్.. అదెలా?

IPL: SRHతో మ్యాచ్‌లో ఓడినా పాయింట్ల పట్టికలో CSK ఒక మెట్టు పైకి ఎక్కడం విశేషం. మ్యాచ్‌కు ముందు -0.846 రన్ రేట్‌తో ఎనిమిదో ప్లేస్‌లో ఉన్న చెన్నై కేవలం 10 పరుగుల తేడాతోనే ఓడిపోవడంతో రన్ రేట్ -0.780కి మెరుగైంది. దీంతో లక్నోను వెనక్కి నెట్టి ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో ఎషాన్ మలింగ యార్కర్లతో కట్టడి చేయగా చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింగే అద్భుతంగా బౌలింగ్ చేసి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు.
News April 19, 2026
నిరుపయోగంగా గజ్వేల్ ఆర్టీసీ బస్టాండ్..!

గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ బస్టాండ్ గజ్వేల్ పట్టణానికి దాదాపుగా కిలోమీటరున్నర దూరంలో ఉండడంతో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. దీంతో కోట్లాది రూపాయల ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతోంది. సదరు బస్టాండ్‌ను ఇతర అవసరాలకు వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.
News April 19, 2026
చిరు, బాలయ్యతో మోహన్‌లాల్ క్రేజీ రోల్స్?

చిరంజీవి, బాబీ కాంబో మూవీలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటిస్తున్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా బాలయ్య-వివేక్ ఆత్రేయ ప్రాజెక్టులోనూ ఆయన పేరు వినిపిస్తోంది. ఒకేసారి ఇద్దరు బిగ్ స్టార్స్ సినిమాల్లో కనిపిస్తే ఫ్యాన్స్‌కు పండగే. అయితే డేట్స్ ఇష్యూ వల్ల చిరు సినిమా నుంచి ఆయన తప్పుకొనే ఛాన్స్ ఉందని టాక్. ఒకవేళ అంతా సెట్ అయితే 2027 సంక్రాంతికి మోహన్‌లాల్ డబుల్ ధమాకా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


