News November 5, 2025
NTR: పీజీ పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (దూరవిద్య) పరిధిలో జులై, ఆగస్టు 2025లో నిర్వహించిన ఎం.ఏ. ఇంగ్లిష్, జర్నలిజం, సోషల్ వర్క్, సోషియాలజీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://anucde.info/ResultsJAug25.asp చూడాలని ANU(దూరవిద్య) పరీక్షల విభాగం తెలిపింది.
Similar News
News January 15, 2026
20 నుంచి కేయూ దూరవిద్య ఎమ్మెస్సీ పరీక్షలు

కేయూ పరిధిలోని దూరవిద్య కేంద్రం(సీడీఓఈ) ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రీవియస్, ఫైనలియర్ విద్యార్థులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, అదనపు నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. ప్రీవియస్ పరీక్షలు ఈ నెల 20, 22, 24, 27 తేదీల్లో జరుగుతాయి. ఫైనలియర్ పరీక్షలు 20, 22, 24, 27, 31 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు.
News January 15, 2026
బంగ్లా క్రికెట్‌లో తిరుగుబాటు: బోర్డు డైరెక్టర్ రాజీనామాకు డిమాండ్!

BCB డైరెక్టర్ నజ్ముల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆ దేశ క్రికెట్‌లో చిచ్చు రేపాయి. T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకొంటే ఆటగాళ్లకు నష్టపరిహారం చెల్లించబోమని అనడంపై క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నజ్ముల్ వెంటనే రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించారు. వివాదం ముదరడంతో స్పందించిన బోర్డు, ఆ వ్యాఖ్యలు తమ అధికారిక వైఖరి కాదంటూ విచారం వ్యక్తం చేసింది.
News January 15, 2026
సూర్యాపేటలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1.సూర్యాపేట 48: ST 4, SC 7, BC 13, UR 24.
2.తిరుమలగిరి 15: ST 1, SC 3, BC 3, UR 8.
3.కోదాడ 35: ST 2, SC 5, BC 10, UR 18.
4. హుజూర్‌నగర్ 28: ST 1, SC 4, BC 9, UR 14.
5.నేరేడుచర్ల 15: ST 1, SC 3, BC 3, UR 8.


