News September 11, 2025

NTR: పోలీసుల కోసం ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్

image

పోలీసుల, వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్‌ను విజయవాడ సీపీ రాజశేఖరబాబు గురువారం ప్రారంభించారు. 1991 బ్యాచ్ పోలీసులు, వైద్యుల సహకారంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఉచిత కన్సల్టెన్సీ, చికిత్సపై 20-30% రాయితీలు లభిస్తాయని సీపీ తెలిపారు. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.

Similar News

News December 7, 2025

వాళ్లు నా లైఫ్‌లో ఉన్నందుకు ఆనందిస్తున్నా: ఆమిర్ ఖాన్

image

రీనా దత్తా, కిరణ్ రావుతో డైవర్స్ తీసుకుని భార్యాభర్తలుగా విడిపోయామే తప్పా మనుషులుగా కాదని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. వారంటే ప్రేమ, గౌరవం ఉన్నాయన్నారు. ‘రీనాను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నా. ఇద్దరం కలిసే లైఫ్‌లో ఎదిగాం. 2వ భార్య కిరణ్‌ అద్భుతమైన వ్యక్తి. ఆమె పేరెంట్స్ మేమంతా కుటుంబం. గర్ల్ ఫ్రెండ్ గౌరి అనుకోకుండా వచ్చిన అదృష్టం. వాళ్లు లైఫ్‌లో ఉన్నందుకు ఆనందిస్తున్నా’ అని చెప్పారు.

News December 7, 2025

పిల్లల్లో ఊబకాయాన్ని ఎలా తగ్గించాలంటే?

image

ప్రస్తుత కాలంలో చిన్నారుల్లో కూడా ఊబకాయం పెరుగుతోంది. దీనివల్ల వారికి భవిష్యత్తులో ఎన్నో సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే..మెరుగైన, పోషకాలతో నిండిన ఆహారాన్ని పిల్లలకు అందించడం చాలా మంచిది. ఆన్​లైన్​లో దొరికే అధిక కేలరీల ఫుడ్స్​ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. పిల్లలకు రోజుకు అరగంటైనా శారీరక శ్రమ ఉండాలి. అలాగే వారు ఒత్తిడికి గురవకుండా చూసుకోవడం ముఖ్యమంటున్నారు.

News December 7, 2025

తిరుపతి: వర్సిటీలో దారుణం.. రేపు లోక్ సభలో చర్చ.?

image

తిరుపతి NSU <<18496982>>వివాదంపై<<>> YCP ఎంపీలు లోక్ సభలో చర్చకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు MP పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ద్వారా లోక్ సభ స్పీకర్‌ను కోరనున్నారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.