News December 1, 2025

NTR: రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య గమనిక

image

రెవెన్యూ శాఖలో పనిచేసి రిటైర్డ్ అయిన ఉద్యోగులను అమరావతి భూసమీకరణ విధులలో భాగం చేసేందుకు CRDA సన్నద్ధమైంది. CRDAలో డిప్యూటీ కలెక్టర్లు(7), తహశీల్దార్(5), డిప్యూటీ తహశీల్దార్(5) ఉద్యోగాలకు రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు DEC 2లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలని, ఇదే వెబ్‌సైట్‌లోని కెరీర్స్ ట్యాబ్‌లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News February 10, 2026

ఓటుకు గుర్తింపు కార్డు తప్పనిసరి: కరీంనగర్ కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ స్లిప్పుతో పాటు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఒకదానిని పోలింగ్ కేంద్రం వద్ద చూపాలని, అర్హులైన వారంతా బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.

News February 10, 2026

SRPT: మున్సిపల్ ఎన్నికల బందోబస్తు కట్టుదిట్టం

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో అధికారులను నియమించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. 446 పీఓలు, 446 ఏపీఓలు, 1340 ఓపీఓలు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులను నియమించినట్లు వివరించారు. ఎన్నికల పర్యవేక్షణ కోసం 10 SSTలు, 15 FSTలు, 7 వీవీటీలు, 7 ఎటీ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.

News February 10, 2026

పార్వతీపురం: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 300 మంది గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన ఇంటర్‌ ప్రాక్టికల్ పరీక్షలకు 300 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీవీఈవో నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. 10,026 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా.. 300 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.