News September 10, 2025

NTR: వైద్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

NTR వైద్యసేవలో 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి(టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APMC రిజిస్ట్రేషన్ కలిగి MBBS పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని, https://apmsrb.ap.gov.in/msrb/లో ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V. సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్‌సైట్ చూడాలన్నారు.

Similar News

News December 13, 2025

కర్నూలు: ఆటో కొనివ్వలేదని సూసైడ్

image

నంద్యాల(D) బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రామాంజనేయులు(30) ఆత్మహత్య చేసుకున్నాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఈయన.. కొంతకాలంగా మద్యానికి బానిసై పనికి వెళ్లలేదు. ఆటో నడుపుతానని, కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేశాడు. మద్యం మానితే కొనిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 2న కల్లూరు(M) పందిపాడు సమీపంలో పురుగుమందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కేసు నమోదైంది.

News December 13, 2025

VZM: గుండె ఆగింది… కానీ చూపు కొనసాగింది

image

కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం అంత శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. రెడ్‌క్రాస్, మానవీయత స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్నియా సేకరించారు.

News December 13, 2025

నారాయణపేట: సింగారంలో కలెక్టర్ ఓటింగ్

image

రేపు జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మండలంలోని సింగారం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కలెక్టర్ బంగ్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి రెవెన్యూ శివారులోకి రావడంతో ఆమె పేరు ఆ గ్రామ ఓటర్ జాబితాలో నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 25 లో ఆమె ఓటు వేయనున్నారు.