News October 7, 2025

NTR DMHOకి అవార్డు

image

ఎన్టీఆర్ జిల్లాలో పలు ఆసుపత్రులను స్వచ్ఛ ఆసుపత్రులుగా తీర్చిదిద్దినందుకు DMHO సుహాసిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. విజయవాడ హెచ్‌బీ కాలనీ యూపీహెచ్‌సీ, అనిగండ్లపాడు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు స్వచ్ఛ అవార్డులు లభించాయని ఆమె తెలిపారు. కలెక్టర్ సూచనలతో పనిచేయడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని DMHO పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

TU: మొదటి రోజు పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరు

image

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో B.Ed, B.P.Ed,LLB,LLM 1,3 సెమిస్టర్ల, PG ఇంటిగ్రేటెడ్(APE/PCH), IMBA 3,5 రెగ్యులర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో జరిగిన B.Ed, B.P.Ed పరీక్షలకు 2,798 విద్యార్థులకు 2,721 మంది హాజరు కాగా, ఇంటిగ్రేటెడ్(APE/PCH),IMBA పరీక్షలకు 230 కి 217 మంది హాజరయ్యారన్నారు. 90 మంది గైర్హాజరయ్యారు.

News January 22, 2026

యాదాద్రి: ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి రద్దు: కలెక్టర్

image

ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగ వాణి కార్యక్రమాన్ని ఈనెల 22వ తేదీన రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని తెలిపారు. అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.

News January 22, 2026

ఖమ్మం: ఆ ఇంట్లో అల్లుడే దొంగ..!

image

అత్తవారి ఇల్లు అల్లుడికి అడ్డా అనుకున్నాడో ఏమో గానీ, ఏకంగా నగలే ఊడ్చేశాడు. కారేపల్లి మండలానికి చెందిన రాంబాబు మద్యానికి బానిసై, డబ్బుల కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని తన అత్త కలమ్మ ఇంట్లోనే ఒకటిన్నర తులాల బంగారు నెక్లెస్ దొంగిలించాడు. దాన్ని అమ్మేందుకు వెళ్తుండగా KMM సత్యనారాయణపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీల్లో చిక్కాడు. అల్లుడే దొంగ అని తేలడంతో బాధితురాలు విస్మయం వ్యక్తం చేసింది.