News August 23, 2025
NZB: అబ్బాయిలు జర జాగ్రత్త..!

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో పురుషులకు వల వేస్తూ, <<17487499>>నగ్న వీడియోలు<<>> తీస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా కారణంగా గతంలో నిజామాబాద్‌లో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. పురుషులతో లైంగికంగా కలిసే అబ్బాయిలే టార్గెట్‌గా ట్రాప్ చేస్తున్నారు. జర జాగ్రత్త..! SHARE IT
Similar News
News January 24, 2026
14 మందితో చెరువుగట్టు ఉత్సవ కమిటీ

చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు 14 మందితో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెరువుగట్టు ఈఓ మోహన్ బాబు తెలిపారు. సభ్యులుగా వరాల రమేష్, రంగ శ్రవణ్, మందుల నరసింహ, కొమ్ము శ్రీసు, గౌరుదేవి లక్ష్మయ్య, రేగటి శ్రీనివాస్ రెడ్డి, నల్ల అనితతో పాటు మరో ఏడుగురు సభ్యులుగా నియమితులయ్యారు.
News January 24, 2026
నేడు నగరిలో చంద్రబాబు పర్యటన

AP: నేడు CM చంద్రబాబు చిత్తూరు(D) నగరిలో పర్యటించనున్నారు. 11AMకు నగరి జూ. కాలేజ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటారు. తర్వాత శాప్ మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజా వేదికలో పాల్గొంటారు. అక్కడ స్వచ్ఛ రథాలను ప్రారంభిస్తారు. అనంతరం జూనియర్ కాలేజ్ గ్రౌండ్‌లో TDP శ్రేణులతో సమావేశమవుతారు. సాయంత్రం తిరుగు పయనమవుతారు.
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.


