News March 28, 2024
NZB: అవినీతిలో ‘తగ్గెదేలే’.. ప్రతీ పనికి డబ్బులివ్వాల్సిందే..!

ఉమ్మడి NZB జిల్లాలో కొందరు అధికారులు లంచాలు తీసుకోవడంలో తగ్గేది లేదంటున్నారు. కొందరు ఉద్యోగులు ACBకి చిక్కుతున్నా తమ పంథాను మార్చుకోవడం లేదు. ఈ ఏడాది JANలో KMRలో ట్రాన్స్‌కో AE గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. తాజాగా కమ్మర్ పల్లి MPDO ఆఫీస్‌లో సీనియర్ అసిస్టెంట్ హరిబాబు లంచం తీసుకుంటుండగా ACB అధికారులు పట్టుకోవడం సంచలనంగా మారింది.
Similar News
News February 11, 2026
NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్‌లో 162 మంది, ఆర్మూర్‌లో 153 మంది, భీంగల్‌లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.
News February 10, 2026
NZB: మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాల వివరాలివే!

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల కోసం పంపిణీ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగరం కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బోధన్‌కు విజయ మేరీ హైస్కూల్, ఆర్మూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు భీంగల్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
News February 10, 2026
NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.


