News August 20, 2025
NZB: ఇద్దరి అరెస్టు.. 8 వాహనాలు స్వాధీనం

జల్సాలకి అలవాటు పడి తెలంగాణ, మహారాష్ట్రల్లో ద్విచక్ర వాహనాలు చోరీలు చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు NZB ACP రాజా వెంకట్ రెడ్డి మంగళవారం తెలిపారు. నిందితులు బోధన్‌కు చెందిన షేక్ ఇలియాస్, షేక్ సమీర్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. షేక్ రియాజ్@ అరబ్@ అర్షద్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
NZB: నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడి అరెస్టు

నకిలీ విదేశీ ఉద్యోగాల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు NZB సైబర్ క్రైమ్ ACP వై. వెంకటేశ్వర్ రావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నిందితుడు టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన గుర్తు తెలియని వ్యక్తి మాటలను నమ్మి, విదేశాల్లో అధిక జీతంతో ఉద్యోగాలు ఉన్నాయంటూ మోసాగిస్తున్నాడన్నారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు.
News January 21, 2026
రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు కమ్మర్‌పల్లి విద్యార్థినులు

కమ్మర్‌పల్లి ZPHS విద్యార్థినులు క్రీడల్లో సత్తా చాటారు. 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-17 పోటీలకు ఈ పాఠశాలకు చెందిన భవాని, వర్షిత్ ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు సాయన్న, PD వేముల నాగభూషణం తెలిపారు. మినీ స్టేడియంలో జరిగిన ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన వీరు, త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
News January 21, 2026
NZB: పోలీస్ అధికారులతో CP సమీక్ష

నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ అధికారులంతా బాధ్యతగా పని చేయాలని సూచించారు. అలాగే సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని ఆదేశించారు. పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ACP రాజా వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


