News May 7, 2025

NZB: ‘ఉగ్రవాదంపై తీసుకునే చర్యపై మా మద్దతు ఉంటుంది’

image

కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదంపై తీసుకునే ఎలాంటి చర్యలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది అమానవీయ చర్య అని విచారం వ్యక్తం చేశారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా చేయాలన్నారు.

Similar News

News February 10, 2026

NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

News February 10, 2026

NZB: ఎన్నికల విధులు.. పోలీసులకు సీపీ దిశా నిర్దేశం

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులకు సీపీ సాయి చైతన్య కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. సిబ్బంది ప్రలోభాలకు లొంగకుండా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అదనపు డీసీపీ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

News February 10, 2026

NZB: రైలులో గుర్తుతెలియని మహిళ మృతి

image

నాందేడ్- మేడ్చల్ డెమో రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సుమారు 70 ఏళ్ల మృతురాలు సహజంగానే తుదిశ్వాస విడిచినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఆమెకు సంబంధించిన ఆనవాళ్లు ఏవి లేవన్నారు. మృతురాలిని గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే ఎస్సై ఫోన్ నంబర్‌ను 8712658591 సంప్రదించాలని సూచించారు.