News March 28, 2024
NZB: ఎంపీ అభ్యర్థులు ఖరారు.. ఇక సమరమే..!

ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో NZB పార్లమెంటు స్థానానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారు అయ్యారు. బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి అరవింద్, BRS అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ ల పేర్లను ఆ పార్టీలు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. అందరి అంచనాలను తారుమారు చేస్తూ తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది. ఇక వీరందరూ.. ప్రజాక్షేత్రంలో రాజకీయ సమరం మొదలు పెట్టాల్సి ఉంది.
Similar News
News February 10, 2026
NZB: ‘సైలెన్స్ పీరియడ్’ అమల్లో ఉంది!

ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరూ పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, పత్రికా సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అనుమతి కలిగిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి ఉందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
News February 10, 2026
NZB: సాయంత్రం 5 వరకు లైన్‌లో ఉన్నవారికి టోకెన్‌లు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు టోకెన్‌లు అందజేస్తామని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.
News February 10, 2026
NZB: రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్రగాయాలు

రెంజల్ మండలం సాఠాపూర్‌లో సామియ ఫంక్షన్ హాల్ వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సాఠాపూర్ నుంచి బోధన్ వైపు వస్తున్న బంతి అనే వ్యక్తి బైక్.. దేవయ్య, నాగేందర్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో గాయపడిన వారికి 108 సిబ్బంది గంగామణి, సతీశ్ ప్రథమచికిత్స చేసి, అనంతరం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.


