News March 28, 2024
NZB: ఎన్నికల వేళ పోలీసుల ప్రత్యేక నిఘా

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లాలో డబ్బు, మద్యంఅక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడంపై పోలీసుశాఖ దృష్టి సారించింది. అందులో భాగంగానే నిజామాబాద్ డివిజన్‌లోని చంద్రశేఖర్ కాలనీ SST చెక్‌పోస్ట్, కంఠేశ్వర్ టెంపుల్, వర్ని ‘X’ రోడ్, SST చెక్‌పోస్ట్, మద్దుల్ ‘X’ రోడ్ SST చెక్‌పోస్ట్, బోధన్ డివిజన్‌లోని ఖండ్‌గాం అంతరాష్ట్ర చెక్‌పోస్ట్, సాలురా అంతరాష్ట్ర చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు విస్తృతవాహన తనిఖీలు చేపట్టారు.
Similar News
News February 18, 2026
నిజామాబాద్: యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం ఫకీరాబాద్ సమీపంలో బైక్ యాక్సిడెంట్ జరిగి గణపతి అనే వ్యక్తి మరణించాడని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఈనెల 9న సాయంత్రం బైక్‌పై బోధన్ నుంచి బాసర వెళ్తుండగా మార్గమధ్యలో ఫకీరాబాద్ సమీపంలో బైక్ స్కిడ్ అయి తీవ్రంగా గాయపడ్డారన్నారు. అనంతరం గణపతి నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందారని చెప్పారు. మృతుడి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
News February 18, 2026
NZB: వార్షిక పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

10వ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించగా కలెక్టర్ మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లను తావులేకుండా పరీక్షలను సజావుగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News February 18, 2026
NZB: అభివృద్ధి తమ లక్ష్యమంటున్న ప్రథమ పౌరులు..!

NZB మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ పురపాలక సంఘాల్లో ప్రథమ పౌరులుగా మహిళలే ఎన్నికవ్వడం విశేషం. NZB మేయర్‌గా కూరగాయల ఉమారాణి, బోధన్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా తూము పద్మ, ఆర్మూర్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్‌గా లహరి, భీంగల్ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా బొదిరే నాగమణి ఎంపికైన సంగతి తెలిసిందే. వీరందరూ తమ ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని అంటున్నారు.


