News October 22, 2024

NZB: గతంలోని టాస్క్ ఫోర్స్ ACP సస్పెన్షన్

image

నిజామాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఏసీపీగా ఇటీవల కాలం వరకు పని చేసిన విష్ణుమూర్తిని సస్పెన్షన్ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీగా పనిచేసిన సమయంలో విష్ణుమూర్తి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, సివిల్ సెటిల్మెంట్లు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తగా అప్పటి సీపీ కల్మేశ్వర్ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ మేరకు 2 రోజుల క్రితం సస్పెండ్ చేశారు

Similar News

News November 6, 2024

నిజామాబాద్: నేటితో ముగియనున్న ఓటరు నమోదు గడువు

image

ఉమ్మడి (కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్) జిల్లాల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన పట్టభద్రులు ఫారమ్-18, ఉపాధ్యాయులు ఫారమ్-19 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో అందజేయాలని వారన్నారు.. ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముందని వారు పేర్కొన్నారు.

News November 6, 2024

నిజామాబాద్: నేటి నుంచి సర్వే స్టార్ట్

image

సమగ్ర కుటుంబ సర్వే నేటి నుంచి మొదలుకానుంది. దీనికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వే చేయాల్సిన ఇళ్లను లిస్టింగ్ చేశారు. 1273 మంది ఆశాలు, 2182 మంది అంగన్వాడీలు, 537 మంది పీఎస్‌లు, 1837 మంది టీచర్లు ఇందులో పాల్గొనున్నారు. జిల్లాలో మొత్తం 3,245 బ్లాక్‌లు ఉండగా, 3,343 మంది ఎన్యూమరేటర్లు ఉన్నారు. 370 మంది సూపర్వైజర్లు ఇందులో పాల్గొంటారు.

News November 6, 2024

లింగంపేట: నాగన్న బావిని పరిశీలించిన కలెక్టర్

image

లింగంపేట మండల కేంద్రంలో ఉన్న నాగన్న బావిని ఇవాళ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నాగన్న బావిని టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలని, కాటేజీలు ఏర్పాటుకు ప్రతిపాదించారు. బావిలో ఉన్న చెత్తను తొలగించాలని, సమీపంలో మొక్కలు నాటి సంరక్షించాలని వారు సూచించారు. అనంతరం బావి చూడడానికి వచ్చిన పాఠశాల చిన్నారులతో పురాతన బావి దాని చరిత్ర గురించి తెలుసుకోవాలని అన్నారు.