News August 20, 2025

NZB: గూఢచారి పావురం కాదు.. రేసింగ్ పావురం: SHO

image

బోధన్ మండలం భవానీపేట్‌లో ఓ పావురం కాలికి రింగు, రెక్కలకు కోడ్‌తో ఉన్న ఓ ట్యాగ్‌తో ఓ బాలుడికి దొరికింది. అది గూఢచారి పావురమంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులకు పావురాన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే అది గూఢచారి పావురం కాదని.. రేసింగ్ పావురమని బోధన్ రూరల్ SHO విజయ్ బాబు తెలిపారు. ఎవరో పెంచుకుని వదిలేసినట్లు అనుమానిస్తున్నామన్నారు.

Similar News

News January 23, 2026

PCOSలో రకాలు తెలుసా?

image

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే దీంట్లో A, B, C, D అని నాలుగు రకాలుంటాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఏర్పడటం వంటి లక్షణాలుంటాయి.

News January 23, 2026

ICMR-NIIRNCDలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్ కమ్యూనబుల్ డిసీజెస్ (<>NIIRNCD<<>>)లో 4 యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు అప్లై చేయడానికి సా. 5.30 గంటల వరకే అవకాశం ఉంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://niirncd.icmr.org.in

News January 23, 2026

ఎరువుల వాడకంలో నిపుణుల సూచనలు

image

వేసవిలో భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాల ఆధారంగా సిఫార్సు చేసిన ఎరువులను వాడాలి. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట పైర్ల ఎరువులను వాడటం వల్ల ఎరువుల సమతుల్యత జరిగి పంట దిగుబడి పెరుగుతుంది. నీటి నాణ్యత, పంటకాలం, పంటల సరళిని బట్టి ఎరువులను వేయాలి. సమస్యాత్మక భూముల్లో జిప్సం, సున్నం, పచ్చిరొట్ట ఎరువులు, సూక్ష్మపోషకాలను వేసి నేలలో లోపాలను సరిచేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.