News March 31, 2024
NZB: చోరికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన స్థానికులు

ఓ రైస్ మిల్లులో చోరీకి వచ్చిన వ్యక్తిని స్థానికులు చితక బాధడంతో మృతి చెందిన ఘటన నిజామాబాద్‌లోని పాల్దా గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని మూసివేతకు గురైన శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్‌లో ఓ తండాకు చెందిన 8 మంది చోరీకి యత్నించారు. గ్రామస్థులు ప్రతిఘటించడంతో ఏడుగురు పారిపోగా.. బానోతు సునీల్ వారికి దొరికాడు. దీంతో వారు అతడిని తీవ్రంగా కొట్టడంతో సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News February 17, 2026
నిజామాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అలర్ట్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు కమిషనరేట్ పరిధిలో 58 పరీక్ష కేంద్రాల వద్ద ఆంక్షలు ఉంటాయన్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని, కేంద్రాల వద్ద జనం గుమిగూడడం నిషేధమని, 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
News February 17, 2026
NZB: ‘తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియ’

తప్పిదాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షణ చేయాలని CEO సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ, ఇతర అంశాలపై సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 17, 2026
NZB: ‘గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలి’

పల్లెల సర్వతోముఖాభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తూ, మహిళా శక్తి సామర్థ్యాలను చాటాలని NZB జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. నిధులు, విధులను సక్రమంగా వినియోగిస్తూ, అందరి సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మార్గనిర్దేశం చేశారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన గురుతర బాధ్యత సర్పంచులపై ఉందని సూచించారు.


