News October 8, 2025

NZB: డిప్లొమా పరీక్షల ఫలితాలు విడుదల

image

నిజామాబాద్‌లోని సుభాష్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి సంగీత నృత్య పాఠశాలలో జూన్ నెలలో జరిగిన సర్టిఫికేట్ డిప్లొమా పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయని ప్రిన్సిపల్ రవీందర్ రాజు తెలిపారు. వివిధ విభాగాల్లో 93 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 68 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధిత పత్రాలతో రుసుము చెల్లించి జనవరిలో జరిగే పరీక్షలకు హజరు కావాలని సూచించారు.

Similar News

News January 13, 2026

బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.