News August 9, 2024

NZB: డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం

image

నిజామాబాద్ జిల్లాలో డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం ప్రారంభించారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ క్యాష్ ఆన్ డెలివరీ’ పేరిట వాట్సాప్ గ్రూపు నడుపుతూ డైరెక్ట్‌గా కంపెనీల నుంచి వస్తువులు తక్కువ ధరకే మీ ఇంటికే వస్తాయని నమ్మిస్తున్నారు. బ్రాండ్ల పేరిట ఆర్డర్లు తీసుకుని నాసిరకం బట్టలు పంపుతున్నారని ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు.

Similar News

News December 16, 2025

3వ విడత.. 1100 మంది సిబ్బందితో బందోబస్తు

image

3వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ఠమైన బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్లు CP సాయి చైతన్య వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 1100 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.

News December 16, 2025

NZB: తుది దశలో మహిళా ఓటర్లే కీలకం

image

NZB జిల్లాలో తుది దశలో జరిగే కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జయాపజయాలు ప్రభావితం చేసేది మహిళా ఓటర్లే. మొత్తం 3,14,091 మంది ఓటర్లు ఉండగా.. పురుషులు 1,44,587 మంది, మహిళలు 1,69,498 మంది, ఇతరులు ఆరుగురు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కన్నా మహిళా ఓటర్లు 24,911 మంది ఎక్కువగా ఉన్నారు.

News December 16, 2025

NZB: బాలుడి విక్రయం కలకలం.. తల్లితో సహా ముగ్గురి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో 2 నెలల బాలుడి విక్రయం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన వారికి రూ.2.40 లక్షలకు కన్న బిడ్డను తల్లి లక్ష్మీ హైదరాబాద్‌లో అమ్మగా పోలీసులకు బాలుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లితో సహా విఠల్, రమాదేవి అనే ముగ్గురిని 4వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.