News March 26, 2024

NZB: డ్రంక్ అండ్ డ్రైవ్..ఇద్దరికీ జైలు శిక్ష

image

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తులకు NZB ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. NZB పట్టణ పరిధిలో ఇటీవల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 12 మంది పట్టుబడ్డారు. వారిని మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 10 మందికి రూ. 11300 జరిమానాలు మరో ఇద్దరికి 2 రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ ACP నారాయణ తెలిపారు.

Similar News

News February 11, 2026

NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్‌లో 162 మంది, ఆర్మూర్‌లో 153 మంది, భీంగల్‌లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.

News February 10, 2026

NZB: మున్సిపల్ ఎన్నికల పంపిణీ కేంద్రాల వివరాలివే!

image

నిజామాబాద్ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల కోసం పంపిణీ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. నిజామాబాద్ నగరం కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బోధన్‌కు విజయ మేరీ హైస్కూల్, ఆర్మూర్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు భీంగల్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

News February 10, 2026

NZB: 488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలో నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లలో ఎన్నికల కోసం 488 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మొత్తం 3,48,116 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, భద్రతా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.