News March 11, 2025
NZB: నూతన సీపీ సాయి చైతన్య నేపథ్యమిదే

2016 బ్యాచ్‌కు చెందిన సాయి చైతన్య ఐఐటీ బెనారస్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌ను పూర్తి చేశారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ నిజామాబాద్ సీపీగా బదిలీ అయ్యారు. గతంలో కాటారం, ములుగు ఏఎస్పీగా, వరంగల్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అదనపు డీసీపీగా, హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ జోన్ డీసీపీగా పని చేశారు.
Similar News
News January 19, 2026
నిజామాబాద్‌లో 13.2°C ఉష్ణోగ్రత

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్‌లో అత్యల్పంగా 13.2°C, సాలూరాలో 13.2, చిన్న మావంది 13.5, ఏర్గట్ల 14.0, మెండోరా 14.1, మంచిప్ప 14.4, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ 14.5, బాల్కొండ, వేంపల్లి 14.6, మదన్ పల్లె 14.7, గోపన్న పల్లి 14.9°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 19, 2026
నిజామాబాద్: ఈనెల 20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు

నిజామాబాద్ జిల్లాలో వన్యప్రాణుల గణన ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ గణనలో పులులు, చిరుతలు, జింకలు, నెమళ్లు, అడవి పందులు తదితర వన్యప్రాణుల సంఖ్యను లెక్కించనున్నారు. సిరకొండ, కమ్మర్పల్లి, ఇందల్వాయి, వర్ని, ఆర్మూర్, నిజామాబాద్ రేంజ్ పరిధిలో ఈ గణన చేపట్టనున్నారు. గణన ఫలితాల ఆధారంగా అటవీ సంరక్షణ, భద్రత చర్యలు మరింత బలోపేతం చేయనున్నారు.
News January 19, 2026
సాలూర వాసికి పుడమి పుత్ర-రైతు మిత్ర అవార్డు

వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న సాలూరకు చెందిన రైతు గంగారాం పుడమిపుత్ర-రైతుమిత్ర జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న కేజీ గంగారం సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఈ అవార్డు దక్కడంపై సాలురా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.


