News May 24, 2024
NZB: పాలిసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

పాలిసెట్- 2024కు ఏర్పాట్లు పూర్తయ్యాయని నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్, సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు. 16 పరీక్ష కేంద్రాల్లో 5,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష ఉ. 11గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు ఉంటుందని విద్యార్థులు 10 గంటలలోపు చేరుకోవాలన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లు, పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ను తీసుకురావాలని తెలిపారు.
Similar News
News March 16, 2026
నిజామాబాద్: తస్మాత్ జాగ్రత్త : సీపీ

ప్రస్తుత కాలంలో డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగాయో అదే స్థాయిలో సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘ఫేక్ పార్సిల్’, ‘కొరియర్ స్కామ్స్’ ద్వారా అమాయకులను నిలువునా దోచుకుంటున్నారని సీపీ సాయిచైతన్న అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. తక్షణ సహాయం కోసం ప్రభుత్వం కేటాయించిన హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయాలన్నారు.

నిజామాబాద్: ఆకాల వర్షం.. పంటకు నష్టం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం వర్షం పడింది. వాతావరణం ఒక్కసారిగా మారి ఈదురు గాలులతో ఆకాల వర్షం కురిసింది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. చేతికోచ్చిన వరి, మెక్కజోన్న పంటలకు నష్టం కలుగుతుందన్నారు. దిగుబడి తగ్గుతుందన్నారు.