News November 19, 2025
NZB: పీఎం శ్రీ పాఠశాల నిధులపై ఏసీబీ అధికారుల తనిఖీలు

నిజామాబాద్‌లోని కలెక్టరేట్‌లో డీఈఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో పీఎం శ్రీ పాఠశాల వివరాలపై ఆరా తీశారు. ఎన్ని పాఠశాలలు పథకానికి ఎంపికయ్యాయి. రెండేళ్లలో వచ్చిన నిధులు, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకంపై పూర్తి వివరాలను తమకు అందజేయాలన్నారు. ఏసీబీ అధికారులు వచ్చే సమయంలో డీఈఓ కలెక్టర్‌తో సమీక్షలో ఉన్నారు.
Similar News
News January 17, 2026
నిజామాబాద్‌లో సైబర్ మోసం

NZB పూసలగల్లి వాసి ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.1.10 లక్షల మోసానికి గురయ్యాడు. లాభాలు గడించే సూచనలు చేసేందుకు రూ.3 వేలు చెల్లించి తమ గ్రూపులో చేరాలని మెస్సేజ్ వచ్చింది. డబ్బులు చెల్లించగా సైబర్ నేరగాళ్లు అతడి ఫోన్‌కు ఒక QR కోడ్ పంపించి, దాన్ని స్కాన్ చేస్తే మెళుకువలు తెలుస్తాయన్నారు. అది స్కాన్ చేయగానే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News January 17, 2026
NZB: మందుగుండు పేలి ఆవు మృతి

వన్యప్రాణుల వేట కోసం దుండగులు వేసిన ఉచ్చు ఒక పాడిఆవు ప్రాణాలను బలితీసుకుంది. రెంజల్ మండలం దూపల్లికి చెందిన కారె సాయికుమార్ అనే రైతు తన ఆవును మేత కోసం జాన్కంపేట్ శివారులోకి తీసుకెళ్లారు. అడవిపందుల కోసం పేలుడు మందును పశువులకు పెట్టే తవుడులో ముద్దలుగా చేసి ఉంచారు. మేత మేస్తున్న క్రమంలో ఆవు ఆ తవుడు ముద్దను తినగానే ఒక్కసారిగా నోట్లోనే పేలుడు సంభవించి ఆవు నోటిభాగం తీవ్రంగా ఛిద్రమై మృతి చెందింది.
News January 17, 2026
NZB: ఆశవాహుల్లో ఉత్కంఠ

నిజామాబాద్ నగర పాలక సంస్థతోపాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు శనివారం మహిళా రిజర్వేషన్లను ప్రకటించనున్న నేపథ్యంలో పోటీ చేసే ఆశావహుల్లో ఉత్కంఠత నెలకొంది. ఏ స్థానం ఎవరికి రిజర్వు అవుతుందోనని కార్పొరేటర్, కౌన్సిలర్ ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అధికార కాంగ్రెస్, BJP, BRSపార్టీల నేతలు తమ వారిని నిలబెట్టించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.


