News January 10, 2025
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి:DMHO
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పీహెచ్‌సీ వైద్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, లక్ష్యం మేరకు ఓపీ సేవలందించాలని సూచించారు. ఆసుపత్రిలోకి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రతి ఓపిని టార్గెట్‌కు అనుగుణంగా చూడాలని తెలిపారు.
Similar News
News January 14, 2025
NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం
గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.
News January 14, 2025
బాల్కొండ: హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి
బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.
News January 14, 2025
NZB: పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
నిజామాబాద్ జిల్లా కేంద్రంగా బోర్డు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపి కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అర్వింద్ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.