News April 26, 2024

NZB: ప్రశాంతంగా ప్రారంభమైన ఓపెన్ పరీక్షలు

image

తెలంగాణ ఓపెన్ స్కూల్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా కొనసాగాయి. పదో తరగతి పరీక్షకు 1017 మందికిగాను 910 మంది హాజరుకాగా, 107 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్లో 1490 మందికిగాను 1340 మంది హాజరుకాగా, 150 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో ఇంటర్ అరబిక్ పరీక్షకు గాను 23 మంది పరీక్షకు హాజరయ్యారు. పలు పరీక్షాకేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు

Similar News

News April 15, 2026

నిజామాబాద్: అంగన్‌వాడీ.. డిజిటల్ వే

image

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్లను పంపిణీ చేస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా దాదాపు 3,250 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, వీటికి కొత్త ఫోన్లను అందజేస్తున్నారు. పాత ఫోన్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల డేటా నమోదులో జాప్యం జరుగుతోందని గుర్తించిన యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీ టీచర్లు కొత్త ఫోన్ల రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News April 15, 2026

NZB: రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌లో జిల్లాకు 9 మెడల్స్

image

రాష్ట్ర స్థాయి అండర్ -17 రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో నిజామాబాద్ రెజ్లర్లు 9 మెడల్స్ సాధించారు. హైదరాబాదులో జరిగిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో టి.వెంకటేష్ గోల్డ్ మెడల్, బి.రోజా సిల్వర్ మెడల్, జి.గణేష్ సిల్వర్ మెడల్ సాధించగా ప్రవీణ్, మహేందర్, సృజన, రాజేశ్వరి, గంగాధర్, అంబాదాస్ బ్రాంజ్ మెడల్ సాధించినట్లు కోచ్ కం మేనేజర్‌గా వ్యవహరించిన దేవేందర్, బిందు తెలిపారు.

News April 14, 2026

నిజామాబాద్‌లో జిల్లాలో 43.2 డిగ్రీల ఎండ

image

జిల్లాలో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మచ్చర్లలో అత్యధికంగా 43.2 డిగ్రీలు, భీంగల్‌ 43.0, మోస్రా 42.9, NZB 42.8, మంచిప్ప, మల్కాపూర్, ఆలూర్, పెర్కిట్ 42.7, మెండోరా, జక్రాన్‌పల్లి 42.6, మోర్తాడ్, గూపన్ పల్లి 42.5, ఇస్సపల్లి 42.4, వేల్పూర్, రేంజల్ 42.3,సాలూర, కోటగిరి, నవీపేట, ఏర్గట్లలో 42.2, ఎడపల్లి 42.1, బాల్కొండ, కోరట్పల్లి 42.0, లక్మాపూర్, కులాస్పూర్,ధర్పల్లి 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.