News March 15, 2025

NZB: మనవడి బర్త్‌డే.. తాత సూసైడ్

image

NZBకి చెందిన రాఘవేంద్రరావు(60) HYD మియాపూర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనవడి బర్త్‌డే పార్టీ కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం షాపింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో రాఘవేంద్రరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 16, 2026

సంగారెడ్డి: పదిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి: డీఈవో

image

పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని సంగారెడ్డిలోని కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు.

News February 16, 2026

సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

image

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.

News February 16, 2026

హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత క్షమాపణలు

image

హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత నాగేంద్రన్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె గురించి అలా మాట్లాడి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు. త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే టీవీకే చీఫ్ విజయ్‌కు వాస్తవాలు తెలుస్తాయంటూ ఆయన ఇటీవల <<19157644>>వ్యాఖ్యానించిన<<>> విషయం తెలిసిందే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష హెచ్చరించడంతో నాగేంద్రన్ దిగివచ్చారు.