News May 7, 2025

NZB: రాహుల్ గాంధీకి MLC కవిత సెటైరికల్ WELCOME

image

రాహుల్ గాంధీ హైదరాబాద్ రాకను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Xలో ఎద్దేవా చేశారు. “దారితప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీకి స్వాగతం..” అంటూ పేర్కొన్నారు. మోసపూరిత హామీలు, అబద్ధపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసగించారన్నారు. హైదరాబాద్ పర్యటనలో లాఠీ దెబ్బలు తిన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు ప్రశ్నలు సంధించారు.

Similar News

News February 12, 2026

నందిపేట్: ఇద్దరి మృతి.. రెండు కుటుంబాల్లో విషాదం

image

నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరుశివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శివ (28) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఈనెల 2న నందిపేట్–కొండూరు మార్గంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో కొడుపల సాగర్ (30) చికిత్స పొందుతూ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన శివ కూడా బుధవారం మృతి చెందాడు. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News February 12, 2026

భీంగల్‌లో అత్యధికం.. నిజామాబాద్‌లో అత్యల్పం

image

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భీమ్‌గల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 69.78 శాతం పోలింగ్ నమోదవ్వగా NZB కార్పొరేషన్‌‌లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఆర్మూర్ మున్సిపాలిటీలో 68%, బోధన్‌లో 68.64 % నమోదైంది. భీంగల్‌లో 14,045 ఓట్లకు గాను 9,800 ఓట్లు, NZBలో 3,48,951 ఓట్లకు గాను 2,05,753 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలో 4,95,485 మంది ఓటర్లకు 3,06,697 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

News February 12, 2026

నిజామాబాద్: వార్ వన్ సైడ్… లేక హంగ్..?

image

నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్, బీజేపీ తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే మొత్తం 60 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ 30కి చాలా దగ్గర బీజేపీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్‌కు 20కి అటు ఇటుగా, MIMకు 10కి పైబడి డివిజన్లు వచ్చే అవకాశం ఉందని, అయితే మేయర్ ఎన్నిక నాటికి ఎక్స్‌అఫీషియో ఓట్లు, ఇతర సమీకరణాలు కీలకమవుతాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.