News March 28, 2024
NZB: రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి జైలు శిక్ష

రైళ్లలో సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరికి 8 నెలల జైలుశిక్ష విధిస్తూ రైల్వే మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి బుధవారం తీర్పు చెప్పారని నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాకు చెందిన జూలు శ్రీకాంత్, నిజామాబాద్ జిల్లాకు చెందిన గజం సత్యం కలిసి కామారెడ్డి, నిజామాబాద్ మధ్య నడిచే రైళ్లలో 9 సెల్‌ఫోన్లు దొంగలించారని సాయిరెడ్డి వివరించారు.
Similar News
News February 10, 2026
NZB: రైలులో గుర్తుతెలియని మహిళ మృతి

నాందేడ్- మేడ్చల్ డెమో రైలులో ప్రయాణిస్తున్న ఓ గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. సుమారు 70 ఏళ్ల మృతురాలు సహజంగానే తుదిశ్వాస విడిచినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. అయితే ఆమెకు సంబంధించిన ఆనవాళ్లు ఏవి లేవన్నారు. మృతురాలిని గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే ఎస్సై ఫోన్ నంబర్‌ను 8712658591 సంప్రదించాలని సూచించారు.
News February 10, 2026
NZB: ‘సైలెన్స్ పీరియడ్’ అమల్లో ఉంది!

ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలతో ముడిపడిన అంశాలపై ఎవరూ పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, పత్రికా సమావేశాలు నిర్వహించరాదని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం ద్వారా అనుమతి కలిగిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణపరమైన అంశాలపై మాట్లాడేందుకు అనుమతి ఉందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.
News February 10, 2026
NZB: సాయంత్రం 5 వరకు లైన్‌లో ఉన్నవారికి టోకెన్‌లు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటల వరకు లైన్‌లో ఉన్న ఓటర్లకు టోకెన్‌లు అందజేస్తామని NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో సీపీ సాయి చైతన్య, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.


