News November 17, 2025

NZB: లోక్ అదాలత్‌లో 4,898 కేసుల పరిష్కారం

image

గత నెల రోజుల నుంచి ఈ నెల 15 వరకు నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 4,898 కేసులు పరిష్కారమైనట్లు సీపీ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా, సైబర్ క్రైమ్‌కు గురైన బాధితులకు రూ.20,96,406 మొత్తాన్ని తిరిగి పొందేలా చర్యలు తీసుకున్నామని సీపీ పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

APPLY NOW: NALCOలో 110 పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

image

నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (<>NALCO<<>>)లో 110 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్/బీఈ(మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్) అర్హత గలవారు జనవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గేట్ 2025 స్కోరు ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://mudira.nalcoindia.co.in

News January 15, 2026

తూ.గో: యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు

image

భక్తుడికి అన్యాయం జరుగుతుంటే దేవుడు చూస్తే ఉరుకోడని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల పేర్కొన్నారు. ఫ్లెక్సీ ఘటనలో అరెస్టై, విడుదలైన వైసీపీ కార్యకర్తలను తూర్పు చోడవరంలో బుధవారం ఆమె పరామర్శించారు. వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి భక్తులకు అన్యాయం జరిగిందంటే దేవుడు ఊరుకోడని, తప్పకుండా స్పందిస్తారని ఆమె వెల్లడించారు. కార్యకర్తలకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు.

News January 15, 2026

HYDలో 3 రోజులు.. సాయంత్రం అలా!

image

పరేడ్ గ్రౌండ్లో కైట్& స్వీట్ ఫెస్టివల్ నేడు ఆఖరిరోజు. నిరాశ చెందకండి రేపటి నుంచి అసలు మజా ఇక్కడే హాట్ ఎయిర్ బెలూన్ షోతో ఉంటుంది. చల్లని సాయంత్రం, చిన్న ఫైర్‌తో రంగుల బెలూన్‌లు ఆకాశంలో ఎగురుతుంటే ఫ్యామిలీ, దోస్తులతో వాటిని చూస్తూ చిల్ అవ్వడం కంటే ఏంకావాలి. ఆకాశంలో ఎగిరే ఈ బెలూన్లు నగరవాసులతో సహా పొరుగు రాష్ట్రాల వారికి మరపురాని అనుభూతిని అందించనున్నాయి. నేడు కైట్ ఫెస్టివల్‌కు భారీగా తరలిరానున్నారు.