News October 7, 2025
NZB: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో జడ్జిగా వెంకటేష్

నిజామాబాద్ జిల్లాకు చెందిన బల్ల వెంకటేష్‌కు YONEX సన్‌రైజ్ BWF వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ -2025 పోటీలకు లైన్ జడ్జిగా అవకాశం లభించింది. ఈ నెల 6 నుంచి 19 వరకు అస్సాంలోని గౌహతిలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ తెలిపారు.
Similar News
News January 23, 2026
NZB: మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు

మేయర్ పదవీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో నిజామాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, BJP తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తమదే మేయర్ పీఠం అంటూ ఇరు పార్టీల నేతలు ఛాలెంజ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ ముందే పూర్తిస్థాయిలో BJP, కాంగ్రెస్ హడావుడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి సుమారు 700, బీజేపీ నుంచి 500 వరకు ఆశావహులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో గెలిచే వారి కోసం సర్వేలు చేపట్టారు.
News January 23, 2026
NZB: టీచర్‌గా మారిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

నిజామాబాద్ గంగస్థాన్‌లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి కాసేపు విద్యార్థులకు ఉపాధ్యాయురాలిగా మారి ఆకట్టుకున్నారు. తరగతి గదిలో స్వయంగా బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను రాసి బాలికలకు బోధించారు. విద్యార్థినుల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు పలు ప్రశ్నలు వేసి వారిని ఉత్సాహపరిచారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కలెక్టర్ పాఠాలు చెప్పడంతో హర్షం వ్యక్తం చేశారు.