News August 12, 2025

NZB: వీటిని చూపించి ఉచిత బస్సు సౌకర్యం పొందండి: RM

image

రాష్ట్రంలో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్స్, ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ RM జ్యోత్స్న తెలిపారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, దివ్యాంగులకు, సీనియర్ సిటిజెన్లకు కేంద్ర, ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డు చూపించవచ్చన్నారు. డిజిటల్ కార్డును తమ మొబైల్ ఫోన్లో చూయించి ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సు సౌకర్యాన్ని పొందాలన్నారు.

Similar News

News March 12, 2026

అనకాపల్లి జిల్లాలో వినూత్న కార్యక్రమం.. సీఎం ప్రశంసలు

image

అనకాపల్లి జిల్లాలో 114 ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలలను జీరో వేస్ట్ స్కూల్స్ గా మారుస్తూ కలెక్టర్ విజయ కృష్ణన్ చేసిన వినూత్న కార్యక్రమం సీఎం చంద్రబాబు ప్రశంసలు అందుకుంది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో జీరో వేస్ట్ స్కూల్స్‌లో చెత్త నుంచి సంపద సృష్టిపై కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ విధానాన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

News March 12, 2026

23న ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన: CM

image

APలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 23న అనకాపల్లి(D) నక్కపల్లి వద్ద ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు CM CBN ప్రకటించారు. ఈ కార్యక్రమానికి PM మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉండటంతో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా రూ.1.35 లక్షల కోట్లతో 2 దశల్లో 5,300 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.

News March 12, 2026

కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

image

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.