News April 13, 2025
NZB: సీపీకి తల్వార్ బహూకరించిన సిక్ కమిటీ

సిక్కుల పవిత్ర బైసాఖి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక పాముల బస్తిలోని ఫతేపూర్ గురుద్వారా సాహెబ్‌లో గురుద్వారా కమిటీ సభ్యులు వివిధ భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పేరుతో తయారు చేయించిన సిక్కుల పవిత్ర తల్వార్‌ను ప్రతినిధి దర్శన్ సింగ్ సోఖీ కమిటీ సభ్యులతో కలిసి బహూకరించారు.
Similar News
News January 18, 2026
NZB: వారం రోజుల్లో 99 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 99 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వారి కోర్టుల్లో హాజరు పరచగా ఇందులో ముగ్గురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా, రూ.5,80,000 జరిమానా విధించారన్నారు. కాగా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ప్రజలకు కమిషనర్ సూచించారు సూచించారు.
News January 18, 2026
NZB: మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఇవే

త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల మేయర్, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. NZbమేయర్ పదవిని జనరల్ (మహిళ)కు, బోధన్ మున్సిపల్ ఛైర్మన్ అన్ రిజర్డ్వ్డ్‌కు రిజర్వ్ చేయగా ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఛైర్మన్ పదవులను జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు.