News November 19, 2025
NZB: స్వాధార్ గృహంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: సబ్ కలెక్టర్

బోధన్ పట్టణంలోని స్వాధార్ గృహంను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలతో కలిసి సందర్శించారు. నివాసితుల వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు.
Similar News
News January 24, 2026
దివ్యాంగ పిల్లలకు పథకాలు అందేలా చూడాలి: జిల్లా జడ్జి

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చొరవ చూపాలని నిజామాబాద్ జిల్లా జడ్జి భరతలక్ష్మి సూచించారు. శనివారం జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘సదరం’ శిబిరాన్ని ఆమె కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పరిశీలించారు. న్యాయ సేవాధికార సంస్థ, డీఆర్డీఏ, విద్యాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చాలని అధికారులను ఆదేశించారు.
News January 24, 2026
NZB: ఎక్సైజ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన కలెక్టర్

నిజామాబాద్ శివారులో తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ జి.సౌమ్యను కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సౌమ్య కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు.
News January 24, 2026
NZB: 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు: CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన వారం రోజుల్లో 158 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 158 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.14,50,000 జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారని CP వివరించారు.


