News November 19, 2025
NZB: స్వాధార్ గృహంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: సబ్ కలెక్టర్

బోధన్ పట్టణంలోని స్వాధార్ గృహంను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలతో కలిసి సందర్శించారు. నివాసితుల వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు.
Similar News
News January 13, 2026
పొలిటికల్ హీట్.. నిజామాబాద్‌లో కాంగ్రెస్ Vs బీజేపీ

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ పాలిటిక్స్ హీటెక్కాయి. ఎన్నికలు రాగానే హిందూత్వ అని బీజేపీ హడావుడి చేస్తుందని రాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాడా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాముని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా కౌంటర్ ఇచ్చారు. రాముని అంశం నేపథ్యంలో నిజామాబాద్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారి మాటల యుద్ధం పెరిగింది.
News January 12, 2026
NZB: 35 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 35 ఫిర్యాదులను CP సాయి చైతన్య స్వీకరించారు. వాటికి సంబంధించిన పోలీస్ స్టేషన్ల SI, CIలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని కనుక్కుని పరిష్కారానికి సూచనలు చేశారు. కాగా ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నట్టు CP చెప్పారు.
News January 12, 2026
NZB: 2025లో రోడ్డు ప్రమాదాల్లో 280 మృతి

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 2024లో 856 ప్రమాదాలు జరిగి 351 మంది మరణించగా, 2025 నవంబరు నాటికి 815 దుర్ఘటనల్లో 280 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరణాల సంఖ్య తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి, నిబంధనలపై ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.


