News December 1, 2025
NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.
Similar News
News February 16, 2026
NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.
News February 16, 2026
NZB: ప్రారంభమైన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారాలు

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఉదయం కార్పొరేషన్ కార్యాలయంలో గెలిచిన అభ్యర్థులతో స్పెషల్ ఆఫీసర్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదటగా కాంగ్రెస్ తరఫున గెలిచిన ఒకటో డివిజన్ అభ్యర్థి అగ్గు బోజన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం ఒక్కొక్కరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు.
News February 16, 2026
NZB: మేయర్ అభ్యర్థిగా ఉమారాణి ఖరారు?

నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్‌గా 49వ డివిజన్‌లో గెలుపొందిన కూరగాయల ఉమారాణి పేరు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముదిరాజ్ సామజిక వర్గానికి చెందిన ఆమె భర్త కరాటే రమేశ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు నమ్మిన బంటుగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని సమాచారం. అయితే రమేశ్ గతంలో టీడీపీలో ఉండి కాంగ్రెస్‌లోకి రావడంతో కొందరు వ్యతిరేకిస్తున్నారు.


