News March 16, 2025

NZB: GREAT.. గ్రూప్- 2, 3లో సత్తా చాటిన SI

image

గ్రూప్-3 ఫలితాల్లో NZB <<15733792>>డిచ్పల్లి 7వ బెటాలియన్ రిజర్వుడ్ SI ఓరంగంటి అశోక్ మరోసారి స్టేట్ 14వ ర్యాంకు <<>>సాధించారు. SI స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం, లింగాపూర్ గ్రామం. ఇటీవల విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 320 మార్కులు సాధించి BC(A)తో పాటు, భద్రాద్రి జోన్ టాపర్‌గా నిలిచారు. అలాగే గ్రూప్-2లో సైతం స్టేట్ 57 ర్యాంక్, BC(A)లో ఫస్ట్ ర్యాంకు సాధించారు. గ్రూప్- 2,3లో సత్తా చాటిన SI పై మీ కామెంట్?

Similar News

News February 16, 2026

NZB: డిప్యూటీ మేయర్‌గా సల్మా తహసీన్?

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా మహిళనే ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. ఇందు కోసం MIM నుంచి 54వ డివిజన్ కార్పోరేటర్‌గా ఎన్నికైన సల్మా తహసీన్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఆమె భర్త మహ్మద్ షకీల్ అహ్మద్ ఫజిల్ ప్రస్తుతం నిజామాబాద్ MIM టౌన్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. గత పాలక వర్గంలో MIMకు చెందిన ఇద్రీస్ ఖాన్ డిప్యూటీ మేయర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే.

News February 15, 2026

NZB: ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. నూతన కార్పొరేటర్లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరవుతున్న నేపథ్యంలో, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రత, ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు.

News February 15, 2026

NZB: యథావిధిగా ప్రజావాణి

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని గుర్తు చేశారు.