News August 14, 2025
NZB: MDM కుకింగ్ కాస్ట్, గౌరవ వేతనాలకు నిధుల విడుదల: DEO

రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం (MDM)కు సంబంధించి పెండింగ్, రెగ్యులర్ బిల్లుల కోసం నిధులు విడుదల చేసినట్లు DEO అశోక్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతుల కుకింగ్ కాస్ట్‌కు రూ.89,00, 445 CCHల గౌరవ వేతనం రూ.1,000 చొప్పున రూ.23.98 వేలు జులై వరకు మంజూరైనట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని మండలాల వారీగా MEO SNA అకౌంట్లకు జమ చేసినట్లు DEO వెల్లడించారు.
Similar News
News March 9, 2026
NZB: 96.7శాతం హాజరు.. 676 మంది విద్యార్థులు గైర్హాజరు

సోమవారం జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం భౌతికశాస్త్రం, అర్ధ శాస్త్రం, ఒకేషనల్ పరీక్షలు ప్రశాంతంగా జరగగా 96.7శాతం విద్యార్థులు హాజరయ్యారని NZBజిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. మొత్తం 20,413 మంది విద్యార్థులకు గాను19,737 మంది హాజరయ్యారని, 676 మంది విద్యార్థులు గైర్ హాజరయ్యారని ఆయన వివరించారు.
News March 9, 2026
NZB: ప్రజావాణి 103 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ లతో కలిసి ఫిర్యాదుదారుల స్వీకరించారు
News March 9, 2026
NZB: జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడు: మహేశ్ కుమార్

జర్నలిస్ట్ లేనిదే రాజకీయ నాయకుడు లేడని TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన NZB ప్రెస్ క్లబ్ ప్రమాణ స్వీకారంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు జర్నలిస్టుల ప్రధాన పాత్ర ఉందన్నారు. పత్రిక రంగానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ఆ విశ్వసనీయత కాపాడాల్సిన బాధ్యత జర్నలిస్ట్‌లకు ఉందన్నారు. జర్నలిస్ట్‌ల కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటానని హామీ ఇచ్చారు.


