News March 4, 2025

NZB: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

ఉమ్మడి ADB-NZB-MDK-KNR గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News December 12, 2025

NZB: నేటి నుంచి నిషేధాజ్ఞలు: CP

image

ఈ నెల 14 న నిజామాబాద్ డివిజన్‌లో నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం శుక్రవారం నుంచి 163 BNSS ఉత్తర్వులు జారీ చేసినట్లు CPసాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్‌లోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు.

News December 12, 2025

ఈనెల 15 నుంచి జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల రీఅడ్మిషన్

image

జీజీ కళాశాల డిగ్రీ 2, 4, 6, సెమిస్టర్ల రీ అడ్మిషన్లకు జనవరి 12వ తేదీ వరకు అవకాశం ఉందని ప్రిన్సిపల్ డా.రామ్మోహన్ రెడ్డి, కంట్రోలర్ భరత్ రాజ్, వైస్ ప్రిన్సిపల్ డా.రంగరత్నం తెలిపారు. డిగ్రీ రెండో సెమిస్టర్ తరగతులు డిసెంబర్ 15 నుంచి ప్రారంభం అవుతాయననారు. విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరు కావాలని సూచించారు.

News December 12, 2025

NZB: ఈ నెల 27వ తేదీలోగా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష ఫీజు గడువు

image

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ జీజీ కళాశాల అధ్యయన కేంద్రంలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ,1, 3, 5వ సెమిస్టర్& ఎంబీఏ, బీఎల్ఎస్సీ 2వ సెమిస్టర్ విద్యార్థులు ఈ నెల 27తేదీలోగా పరీక్షా ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, కో-ఆర్డినేటర్ డా.కె.రంజిత తెలిపారు. ప్రాక్టికల్స్ ఉండే విద్యార్థులు సంబంధిత ఫీజును చెల్లించాలన్నారు. అదనపు సమాచారం కోసం 7382929612ను సంప్రదించాలన్నారు.