News March 13, 2025

NZB: UPDATE.. ACB సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం

image

NZB <<15734537>>రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న వైనాన్ని ఏసీబీ<<>> అధికారులు గుర్తించారు. బుధవారం సుదీర్ఘంగా జరిపిన సోదాల్లో ఏజెంట్ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.

Similar News

News February 16, 2026

అనకాపల్లి: బిల్ గేట్స్ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతిలో బిల్ గేట్స్‌తో జరిగిన సమావేశంలో అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ వర్చువల్‌గా పాల్గొన్నారు. జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను వారు వివరించారు. ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను తెలియజేశారు.

News February 16, 2026

కామారెడ్డి జిల్లాలో పుర పీఠాలు వీరివే..!

image

1. కామారెడ్డి ఛైర్ పర్సన్ – ఇప్ప ఉమారాణి (కాంగ్రెస్)
వైస్ ఛైర్ పర్సన్ – కాసర్ల గోదావరి (బీఆర్ఎస్)
2. ఎల్లారెడ్డి ఛైర్మన్ – పద్మా శ్రీకాంత్ (కాంగ్రెస్)
వైస్ ఛైర్ పర్సన్ – మత్తమాల భాగ్యవతి (కాంగ్రెస్)
3. బిచ్కుంద ఛైర్ పర్సన్ – సీమా శెట్కార్(కాంగ్రెస్)
వైస్ ఛైర్ పర్సన్ – భాగ్యలక్ష్మి (కాంగ్రెస్)
4. బాన్సువాడ ఛైర్ పర్సన్- కాసుల విజయ (కాంగ్రెస్)
వైస్ చైర్ పర్సన్- రేష్మా ఏజాజ్ (కాంగ్రెస్)

News February 16, 2026

ఆమదాలవలస: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి

image

ఆమదాలవలస(శ్రీకాకుళం రోడ్డు) రైల్వే స్టేషన్ కుద్దిరాం రైల్వే గేట్ సమీపంలో ఇవాళ జరిగిన రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంంతో జీఆర్‌పీ ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాని చేరుకొని డెడ్ బాడీని పరిశీలించారు. మృతునికి 45 ఏళ్లు ఉంటాయని, గళ్ల చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్‌ను ధరించినట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు స్థానిక జీఆర్పీ స్టేషన్ సంప్రదించాలన్నారు. దీనిపై కేసు నమోదైంది.