News April 1, 2024

NZB, ZHB నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు వీరే..!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా సుదర్శన్ రెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జిగా దామోదర్ రాజ నర్సింహను నియమించారు.

Similar News

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేనా?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడం లేదు. 2020లో NZB కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 4,34,701 మంది ఓటర్లకు గాను 2,79,840 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా డివిజన్లు, వార్డుల్లో 80 శాతం పోలింగ్ దాటలేదు.

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో 2 గంటల్లో పోలింగ్ శాతం ఎంతంటే?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లో పోలింగ్ శాతం 15% కూడా దాటలేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై 9 గంటల వరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 6.49 శాతం, బోధన్ మున్సిపాలిటీలో 14.24 శాతం, ఆర్మూర్ మున్సిపాలిటీలో 11.05శాతం, భీంగల్ మున్సిపాలిటీలో 9.38 శాతం పోలింగ్ నమోదైంది.

News February 11, 2026

బోధన్: దొంగ ఓటు వేసేందుకు యత్నం.. ఇద్దరిపై కేసు

image

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్, గోశాలలో దొంగ ఓటు వేయడానికి ప్రయత్నించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు SHO వెంకట నారాయణ తెలిపారు. రాకాసిపేట్ బూత్ నం 24, గోశాల బూత్ నం 78లోని పోలింగ్ కేంద్రాల్లో ఇద్దరు నిందితులు తప్పుడు గుర్తింపు పత్రాలతో ఓటు వేయడానికి ప్రయత్నించారన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సదరు వ్యక్తులపై ఎన్నికల నియమావళి ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.