News August 11, 2025

NZSR: నవోదయలో ప్రవేశాలకు గడువు పెంపు

image

నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గడువు నిన్నటితో ముగిసింది. అయితే ఈ గడువు ఈ నెల 20 వరకు పొడిగించినట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సీతారాం బాబు పేర్కొన్నారు. 10వ తరగతిలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి NZB జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -SHARE IT

Similar News

News March 14, 2026

RJY: డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా

image

ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బహిరంగ మద్యం, గంజాయి సేవనం, జూదం, చైన్ స్నాచింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టు వేయడమే లక్ష్యంగా రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పాడుబడ్డ ఇళ్లు, అపార్ట్మెంట్లను డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 14, 2026

NRPT: ‘సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోండి’

image

2025- 26 సంవత్సరానికి గాను ఎస్సీ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఎలక్ట్రిక్ ద్వి, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంపు సెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నారాయణపేట అదనపు కలెక్టర్ ఫణీందర్ రెడ్డి శనివారం ప్రకటనలో కోరారు. ఈనెల 17 నుంచి 24 వరకు https://tsobmms.cgg.gov.in వెబ్సైట్లో లేదా మీ సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. 21 నుంచి 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని అన్నారు.

News March 14, 2026

ఏలూరులో ఈనెల 17న జాబ్ మేళా

image

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో కెపీడీటీ హైస్కూల్‌లో ఈనెల 17న (మంగళవారం) జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. 20 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, 1,497 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, బీటెక్, ఫార్మసీ విద్య అర్హత కలిగిన 18-35 ఏళ్లవారు అర్హులన్నారు.