News October 7, 2025
NZSR: నవోదయలో ప్రవేశ దరఖాస్తు గడువు పెంపు

నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు గడువును OCT 21, 2025 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ రాంబాబు మంగళవారం తెలిపారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 7, 2026న నిర్వహిస్తారు. అర్హత గల విద్యార్థులు వెంటనే https://www.navodaya.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.
Similar News
News January 15, 2026
తిరుపతి: ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు…?

TTD, రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా ప్రజలు భూ సమస్యను ఎదుర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో శేషసాయి నగర్‌లో ఉన్న భూములను 22A క్రింద తీసుకొచ్చారు. దీంతో ఈ ల్యాండ్స్ లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు రాకుండా నిలిచిపోయాయి. 22A నిబంధనలు, IDT క్లెయిమ్స్ వల్ల చట్టబద్ధంగా కొనుగోలు చేసిన భూములను అనుభవించలేక, వేరొకరికి అమ్మలేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.
News January 15, 2026
నెల్లూరు: ‘నాకు రూ.5 వేలు వచ్చాయి’ అంటూ మెసేజ్ వచ్చిందా..

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని చేజర్ల ఎస్సై తిరుమలరావు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు.
News January 15, 2026
సీఎం పర్యటన.. ఏర్పాట్ల పరిశీలన

భోరజ్ మండలం చనాక కొరాట వద్ద ఏర్పాటు చేసిన పంప్ హౌస్‌ను రేపు ప్రారంభించేందుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గురువారం పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని, ఆ మేరకు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఎస్పీ, కలెక్టర్ ఆదేశించారు.


