News August 2, 2024

Olympics: ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్

image

ఇప్పటికే 2పతకాలు సాధించిన మను భాకర్ ఇవాళ జరిగే ఉమెన్స్ 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొంటారు. ఆమెతో పాటు ఈషా సింగ్ బరిలో ఉన్నారు. బ్యాడ్మింటన్‌ క్వార్టర్స్‌లో లక్ష్యసేన్, మెన్స్ షూటింగ్‌లో అనంత్‌జీత్ పోటీ పడనున్నారు. ఆర్చరీ మిక్స్‌డ్-ధీరజ్, అంకిత, రోయింగ్ ఫైనల్-బల్‌రాజ్, షాట్‌పుట్-తజిందర్‌పాల్ బరిలో ఉన్నారు. మెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఫొటోల్లో..

Similar News

News December 5, 2025

పవనన్నకు థాంక్స్: లోకేశ్

image

AP: చిలకలూరిపేట ZPHSలో నిర్వహించిన మెగా PTM 3.Oకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్‌కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ‘హైస్కూలు లైబ్ర‌రీకి పుస్త‌కాలు, ర్యాక్‌లు, 25 కంప్యూట‌ర్లు అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న‌న్న‌కు ధ‌న్య‌వాదాలు. ఏపీ మోడ‌ల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ ద్వారా మ‌న విద్యావ్య‌వ‌స్థ‌ను 2029 నాటికి దేశంలోనే నంబర్ వ‌న్‌గా తీర్చిదిద్దేందుకు Dy.CM అందిస్తున్న స‌హ‌కారం చాలా గొప్పది’ అని ట్వీట్ చేశారు.

News December 5, 2025

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డుల్లోకెక్కిన సీఎం నితీశ్

image

బిహార్ CM నితీశ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు. ఇటీవల పదోసారి CMగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌(లండన్)లో చేరినట్లు JDU తెలిపింది. 2000లో తొలిసారి CM అయిన నితీశ్ వారం రోజులే పదవిలో ఉన్నారు. తర్వాత 2005 నుంచి వరుసగా 5సార్లు సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేసి మళ్లీ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు.

News December 5, 2025

కప్పు పట్టేస్తారా? పట్టు విడుస్తారా?

image

సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన IND 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచు గెలిచి ఊపు మీద కనిపించింది. దీంతో ఇంకొక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ మనదే అనుకున్నారంతా. కానీ బౌలింగ్ ఫెయిల్యూర్, చెత్త ఫీల్డింగ్‌తో రెండో వన్డేను చేజార్చుకుంది. దీంతో రేపు విశాఖలో జరిగే చివరి వన్డే కీలకంగా మారింది. మరి భారత ఆటగాళ్లు ఈ మ్యాచులో సమష్టిగా రాణించి, సిరీస్ పట్టేస్తారో లేక SAకు అప్పగిస్తారో చూడాలి.