News March 26, 2024
ఓం భీం బుష్.. రూ.21.75 కోట్ల కలెక్షన్లు

‘ఓం భీం బుష్’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.21.75 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్రంలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కామెడీ టైమింగ్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తోంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
Similar News
News February 17, 2026
రికార్డు సృష్టించిన శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్

T20 WCలో భాగంగా శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సృష్టించింది. హాట్‌స్టార్‌లో 10 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. దీంతో ఈ టోర్నీలో 100 మిలియన్ల వ్యూయర్‌షిప్ సాధించిన తొలి నాన్ ఇండియా మ్యాచ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 181 పరుగుల <<19162360>>లక్ష్యాన్ని<<>> 2 వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలోనే శ్రీలంక ఛేదించింది. T20 WCలో ఆ జట్టుకు ఇదే హయ్యెస్ట్ ఛేజింగ్.
News February 17, 2026
ఇక MPTC, ZPTC ఎన్నికలపై ఫోకస్!

TG: పంచాయతీ, మున్సిపల్ పోరు ముగియడంతో ఇక MPTC, ZPTC ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఇవాళ అధికారులతో CM రేవంత్ రెడ్డి కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ తర్వాత పోల్స్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని, 15-20 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్, <<19148172>>ఇంటర్<<>>, టెన్త్ పరీక్షలకు తగ్గట్లుగా ఎన్నికలపై నిర్ణయం తీసుకోనున్నారు.
News February 17, 2026
హార్దిక్ పాండ్య ‘రుద్ర’ వాచ్ గురించి తెలుసా?

శివరాత్రి రోజున <<19153355>>పాక్‌తో జరిగిన<<>> మ్యాచ్‌లో భారత ప్లేయర్ హార్దిక్ పాండ్య ధరించిన వాచ్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. జాకబ్ అండ్ కో సంస్థ ‘రుద్ర’ పేరుతో వీటిని తయారు చేస్తోంది. ఒక్కోటి రూ.25 లక్షల వరకు ఉంటుందని, ప్రపంచంలో 25 పీసులే ఉన్నాయని తెలుస్తోంది. వాచ్ డిస్‌ప్లేపై ధ్యానంలో ఉన్న శివుడు, ఓం, గుడి చిత్రాలున్నాయి. 41 MM గ్రేడ్ 5 టైటానియం కేస్‌తో ఇది తయారైంది. 70 గంటలపాటు పవర్ రిజర్వ్ ఉంటుంది.


