News March 27, 2024
ఏప్రిల్ 13న BRS భారీ బహిరంగ సభ

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు.
Similar News
News February 18, 2026
EC.. తుగ్లక్ కమిషన్: మమతా బెనర్జీ

ఎన్నికల సంఘం ఓ తుగ్లక్ కమిషన్ అని బెంగాల్ CM మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న కమిషన్ అని ఆరోపించారు. ‘BJP ఐటీ సెల్ కార్యకర్త బెంగాల్‌లో 58 లక్షల ఓటర్ల పేర్లను AI ద్వారా తొలగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా EC ధిక్కరిస్తోంది’ అని విమర్శించారు. SIR పేరుతో ప్రజల ఓటు హక్కును లాగేసుకుంటోందని, వారిని టెర్రరిస్టుల్లా చూస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
News February 18, 2026
నాకు క్లీన్ చిట్ వచ్చింది.. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్’పై ట్రంప్

లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘ఎప్‌స్టీన్ ఫైల్స్ విషయంలో నేను రహస్యంగా దాచుకోవడానికి ఏమీ లేదు. నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. వాటికి ఎలాంటి ఆధారాలు లేవు. కోర్టు కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చింది’ అని ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఎప్‌స్టీన్ తనకు వ్యతిరేకంగా పని చేసినట్లు ఆరోపించారు.
News February 18, 2026
జపం ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు?

జపం చేసే స్థలం, ఆసనాన్ని బట్టి ఫలితం మారుతుందని శాస్త్ర వచనం. వాటి ప్రకారం.. ఉన్ని వస్త్రంపై జపం వంశవృద్ధిని, పర్వత శిఖరంపై జపం తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఇంట్లో చేసే జపం సాధారణ ఫలితం, నదీ తీరంలో చేస్తే అంతకన్నా 2 రెట్లు, గోశాలలో 100 రెట్లు పుణ్యం లభిస్తుంది. తిరుమల, కాశీ, శ్రీశైలం వంటి స్వయంభూ క్షేత్రాల్లో చేసే జపానికి కోటి రెట్ల ఫలితం ఉంటుంది. సూర్యుడు, గురువు, దీపానికి అభిముఖంగా జపం చేయాలి.


